Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Minister Satya Prasad: పులివెందుల ప్రజలు రౌడీయిజం మాకు వద్దని కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం చేయడం కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు.
Drug Abuse: వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్-తిరుపతి ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి నడుస్తున్న హిసార్ ఎక్స్ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.
TTD AEO Suspended: తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో పోలీసులు బీట్ నిర్వహించారు.. తుమ్మలగుంట ఫ్లైఓవర్ పై కొంతమంది యువకులు వాహన చోదకులకు ఇబ్బందులు కల్గించే విధంగా ఫొటోషూట్ పేరుతో ఇబ్బంది కలిగిస్తున్నట్టు గుర్తించింది డ్రోన్ కెమెరా.. ఇక, డ్రోన్ కెమెరా యువకులను చిత్రీకరిస్తున్నట్లు గమనించి వెంటనే.. అక్కడి నుంచి బైకులపై పరారయ్యారు యువకులు
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆలయం ముందురున్న చలువ పందిళ్లు అంటుకున్నాయి. మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటి వచ్చి పరుగులు తీశారు. స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. Also Read: Schools Bandh: అలర్ట్.. నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్! ఫైర్…
తిరుపతిలో ఓ కారులో డెడ్ బాడీలు కలకలం రేపాయి. తిరుచానూరు రంగనాధం వీధీలో ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలిసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో బీర్లు తాగి మత్తులో అలానే నిద్రించడంతో ఊపిరి ఆడక మృతి చెందారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుల మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కారులో నాలుగు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వినయ్, దీలీప్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను…
Tirumala Darshanam Booking: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్లైన్ దర్శన టికెట్లను నేడు (జూన్ 24) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్లు అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల కానున్నాయి. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లేదా టీటీడీ అధికారిక యాప్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. Read Also:AP Cabinet Meeting: నేడే ఏపి…