ఇవాళ్టి నుంచి మేడారంలో మహాజాతర. నాలుగురోజుల పాటు జరగనున్న జాతరకు కోటిన్నరమంది భక్తులు వస్తారని అంచనా. హెలికాప్టర్ లోనూ మేడారం వెళ్ళే అవకాశం. ఇవాళ తిరుమలలో మాఘమాస పౌర్ణమి సేవ నిర్వహిస్తున్న టీటీడీ. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై మాఢ వీధులలో విహరించనున్న మలయప్పస్వామి. తిరుమలలో ఉదయాస్తమాన సేవా యాప్ ని ప్రారంభించనున్న టీటీడీ. ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించనున్న టీటీడీ. తిరుమల అంజనాద్రిలో…
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. త్వరలో తిరుమల దర్శన టికెట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. దేశంలో స్వల్పంగా గడిచిన 24 గంటల్లో 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 1,241 మరణాలు నమోదు కాగా ప్రస్తుతం దేశంలో 7,90,789 యాక్టివ్ కరోనా కేసులు వున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో…
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది. 8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ.…
తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 26,401 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 12,401 మంది భక్తులు. హుండి ఆదాయం రూ.2.18 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దేవుని కడప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కూడా ఏకాంతంగా…
కోవిడ్ కారణంగా తిరుమలకు వెళ్ళే భక్తులు తగ్గారు. ఇప్పుడిప్పుడే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ ప్రకియ ప్రారంభిస్తాం అని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా ప్రస్తుతం సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తున్నాం అన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుంది అన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి చేసే విధానాన్ని గత…
తిరుమల ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. ప్రతిరోజూ 12వేల టిక్కెట్లు చొప్పున రూ.300 దర్శనం టిక్కెట్లను టీటీడీ అందుబాటులో ఉంచగా.. అన్నీ టిక్కెట్లు 40 నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి. చాలా మంది భక్తులకు టిక్కెట్లు దొరక్కపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల కాగా మరోవైపు ఫిబ్రవరి…
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి మాసానాకి సంబంధించిన దర్శనం టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. ఎల్లుండి ఆన్లైన్లో ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటా టికెట్లను ఉంచనున్నారు.. ఎల్లుండి ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్‌చేసుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి మాసంలో రోజుకి 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నారు.. మరోవైపు.. ఈ నెల 29వ తేదీన సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ.. రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళిసై సౌందరరాజన్ దంపతులు.. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన తెలంగాణ గవర్నర్.. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు… ప్రజలందరూ…