* ఇవాళ ఉదయం 9.05 – 9.45 నిమిషాలకు క్యాంప్ కార్యాలయం నుంచి 26 జిల్లాలను వర్చువల్‌గా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. *మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. చివరిసారిగా 1979లో ఏర్పడిన విజయనగరం జిల్లా. *నేడు కోనసీమ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును…
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో…
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల టీటీడీ ప్రకటించింది. అందుకు సంబంధించి గురువారం నాడు దర్శన టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టోకెన్ల జారీని టీటీడీ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది. ఆయా టోకెన్లను ఏప్రిల్ 8వ తేదీ ఉ.11 గంటలకు టోకెన్లు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ ఉ.10 గంటలకు,…
శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.…
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5వరకు స్వామివారి దర్శనాలకు బ్రేక్. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలులో సీనియర్ కార్యకర్తలకు సన్మానం విశాఖలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం. రైవాడ జలాశయం నీటికి రాయల్టీ చెల్లింపు…
కరోనా మహమ్మారి విజృంభణతో భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా వికలాంగులు, వయో వృద్ధులకు శుభవార్త చెప్పింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకీ 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక…
తిరుమలలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉచిత బస్సులో (శ్రీవారి ధర్మరథం) మంటలు చెలరేగాయి. శ్రీవారి సేవకులను బస్సులో తిరుపతి నుంచి తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అయితే మంటలను సకాలంలో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశాడు. అనంతరం ఆ తర్వాత బస్సులోని శ్రీవారి సేవకులు వాహనం నుంచి…
కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారిని దర్శించుకోవడం భక్తులకు కష్టంగా మారింది.. ఆ తర్వాత పరిస్థితులు అన్నీ అదుపులోకి రావడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతూ వస్తోంది టీటీడీ.. సాధారణ రోజుల్లో మాదిరిగానే ప్రస్తుతం రోజుకు దాదాపు 70వేల మందికి పైగా భక్తులు నిత్యం శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సిఫార్సులు, ఆన్లైన్ సేవలు, శ్రీవాణి ట్రస్ట్, టీటీడీ ఛైర్మన్, పాలక మండలి కోటాలో ప్రతిరోజూ టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ..…
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం శ్రీవారి దర్శనాలపైనే కాదు.. ఆర్జిత సేవలు సహా వివిధ సేవా కార్యక్రమాలపై కూడా పడింది.. అయితే, క్రమంగా కరోనా కేసులు తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించనుంది.. ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ,…