కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారిని దర్శించుకోవడం భక్తులకు కష్టంగా మారింది.. ఆ తర్వాత పరిస్థితులు అన్నీ అదుపులోకి రావడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతూ వస్తోంది టీటీడీ.. సాధారణ రోజుల్లో మాదిరిగానే ప్రస్తుతం రోజుకు దాదాపు 70వేల మందికి పైగా భక్తులు నిత్యం శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సిఫార్సులు, ఆన్‌లైన్ సేవలు, శ్రీవాణి ట్రస్ట్, టీటీడీ ఛైర్మన్, పాలక మండలి కోటాలో ప్రతిరోజూ టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ.. ఇక, ఇప్పటివరకు ప్రతి నెల చివరి వారంలో తర్వాతి నెలకు సంబంధించిన టోకెన్లను మాత్రమే విడుదల వచ్చిన అధికారులు ఇప్పుడు ఏకంగా మూడు నెలలకు సరిపడా కోటాను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.
Read Also: Astrology: మార్చి 21, సోమవారం దినఫలాలు
అందులో భాగంగా ఇవాళ ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. ఇవాళ ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లు విడుదల కానుండగా.. రేపు మే నెల, ఎల్లుండి జూన్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకి 30 వేల టికెట్ల చొప్పున గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకి 25 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు. మొత్తంగా 3 నెలలకు సంబంధించిన 25 లక్షల టికెట్ల విక్రయం ద్వారా టీటీడీ ఖజానాకు రూ.75 కోట్లు జమకానున్నాయి.