Tirumala: శ్రీవారి ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం శ్రీవారి దర్శనాలపైనే కాదు.. ఆర్జిత సేవలు సహా వివిధ సేవా కార్యక్రమాలపై కూడా పడింది.. అయితే, క్రమంగా కరోనా కేసులు తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించనుంది.. ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. గతంలోనే ఉన్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుక్‌చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
మరోవైపు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వర్చువల్ విధానం కూడా కొనసాగుతోందని స్పష్టం చేసింది టీటీడీ.. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది.. అయితే, వారికి శ్రీవారి దర్శనంతో పాటు ప్రసాదాలు అందిస్తామని తెలిపింది.. ఇక, అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతించనున్నట్టు పేర్కొంది టీటీడీ.
Also Read
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
- TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
తాజావార్తలు
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!