తేనే తుట్టను కదిలించడం.. తేనెటీగలతో కుట్టించుకోవడం TTD పాలకమండలికి రోటీన్గా మారిపోయింది. ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు కూడా ఆ కోవలోకే చేరింది. ఆ అంశంపై ఎందుకు చర్చ ప్రారంభించారు? ఎందుకు వెనక్కి తగ్గారు? అసలేం ఏం జరిగింది? హడావిడి నిర్ణయాలు.. ఆనక వెనక్కి తగ్గడం..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి యూటర్న్స్ పాలకమండలిగా మారిపోతోంది. సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం.. కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడం.. చివరికి వెనక్కి తగ్గడం ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది.…
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఐఆర్సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం మరో రికార్డు సృష్టించింది… కరోనా మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు.. హుండీ ఆదాయం కూడా తగ్గిపోయిన విషయం తెలిసిందే కాగా.. మళ్లీ అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో.. ఇప్పుడు క్రమంగా భక్తుల సంఖ్యతో పాటు.. హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది… ఈ నేపథ్యంలో… శుక్రవారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది.. Read…
గత వారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలోని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంభాషణను మొబైల్ వీడియో కటింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా కట్ చేసి దుష్ప్రచారంగా వాడుకుంటున్న దుండగులపై టీటీడీ సీరియస్ అయింది. ఎవరైతే దుష్ప్రచారం లో భాగంగా సామాజిక మాధ్యమాలలో వీడియోని కట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోంది టీటీడీ యాజమాన్యం. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అని టీటీడీ యాజమాన్యం హెచ్చరించింది. పాలకమండలి…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పెద్ద సంఖ్యలో శ్రీవారిని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా అయిపోయింది… ఇక, ఆన్లైన్లో పెట్టే దర్శనం టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో.. సాధారణ భక్తులు, ఆన్లైన్ సేవలకు దూరంగా ఉండేవారికి ఇబ్బందిగా మారింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దర్శన టికెట్ల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.. Read Also: Drunk and Drive: వాహనాదారులకు ఊరట..…
తిరుమలలో త్వరలోనే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తుల అనుమతి ఎప్పుడనేది ఆధికారులు ఏర్పాట్లు చేశాక ప్రకటిస్తామని తెలిపారు. తిరుమలలో సామాన్యుడి నుంచి వీఐపీల వరకు అందరికీ ఒకే రకమైన అన్నప్రసాదం అందిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుందన్నారు. తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు పూర్తిగా తొలగిస్తామన్నారు. హోటళ్లు లేకుండా భక్తులకు ఉచితంగా భోజనం అందించేలా చర్యలు చేపడతామన్నారు.…
టీటీడీ బోర్డు గురువారం నాడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాకుండా సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రాలంకరణ సేవా టికెట్ ధరను రూ.లక్షకు పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారు తాపడ…
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రాణదాన ట్రస్టుకు ఆన్లైన్లో విరాళాల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇందులో భాగంగా రూ.కోటి విరాళాలు అందించిన భక్తులకు టీటీడీ ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయిస్తోంది. శుక్రవారం రోజు ఈ సేవ పొందాలంటే రూ.1.5 కోట్లు విరాళంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు బుధవారం 531 టిక్కెట్లను టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచగా.. ఇప్పటివరకు రూ.82 కోట్ల విరాళాలకు సంబంధించి 68 టిక్కెట్లను మాత్రమే భక్తులు పొందారు. ఇందులో శుక్రవారం టిక్కెట్లు 28…
ఆంధ్ర రాష్ర్టానికి శ్రీవేంకటేశ్వర స్వామే ఆస్తి అన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. శ్రీవారి అనుగ్రహం లేకుండా తిరుమలలో ఏ కార్యక్రమం జరగదన్నారు. శ్రీవారిని సాక్షాత్కారం చేసుకున్న అన్నమయ్య,పురంధరదాసు,తరిగోండ వెంగమాంబ అంజనాద్రియ్యే తిరుమల అని చెప్పారు. వీరు చెప్పిన తరువాత కూడా ప్రామాణితలు కావాలని కోరడం సమంజసమా? రామజన్మ భూమిని నిర్దేశించిన చిత్రకూట్ పీఠాధిపతులు రామభద్రాచార్యుల వారు కూడా అంజనాద్రియ్యే హనుమంతుడి జన్మస్థలంగా నిర్దేశించారు. మరోవైపు హనుమంతుడి జన్మస్థలం నిర్దారణ కోసం కమిటీని ఏర్పాటు చేసాం…