Tirumala Mettu: శ్రీవారి మెట్టుమార్గానికి మోక్షం ఎప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు.
కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో ఏడుకొండలవాడి చెంతకు చేరుకుంటారు. తిరుమల చేరుకోవడానికి ఉన్నవి రెండు నడకమార్గాలు. ఒకటి అలిపిరి, మరోక్కటి శ్రీవారి మెట్టు మార్గం. తిరుపతి నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉండేది ఈ శ్రీవారి మెట్టు నడకమార్గం, పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తరువాత సాక్షాత్తు ఆ స్వామి అమ్మవార్లు కొండపైకి నడిచివెళ్లిన మార్గం కాబట్టే దానికి శ్రీవారి మెట్టు నడకమార్గంగా ప్రసిద్ధి చెందింది.
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇంతటి ప్రాశస్త్యం కలిగిన నడకమార్గం గతేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దాదాపు 500 పైగా మెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నాలుగు కల్వర్ట్‌లతో పాటు మెట్లకు ఇరువైపులా ఉండే రిటైనింగ్ వాల్స్ ధ్వంసమైపోయాయి. వరద ప్రభావంతో శ్రీవారి మెట్టు నడకమార్గం గుర్తుపట్టలేనంత.. పెద్దపెద్ద బండరాళ్లు, గుండులు, మట్టిపెళ్లలు, కొండచరియలతో నిండిపోయింది. తిరుమల చరిత్రలో మొదటిసారి మెట్లమార్గం భారీస్థాయిలో దెబ్బతింది.
దీంతో గత ఏడాది నవంబర్ 19వ తేదీ శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని టీటీడీ మూసివేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో రోజూ టీటీడీ 6వేల సర్వదర్శనం టోకెన్లు మంజూరు చెసేది. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసి వేయడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వచ్చే గోవింద మాలధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.
ఇక నెల రోజుల్లో శ్రీవారిమెట్టు మార్గం పనులు పునరుద్ధరణ చేస్తామని చెప్పారు అధికారులు.. అయితే 5 నెలల గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు. 800వ మెట్టు, 1200వ మెట్టు వద్ద 30 అడుగుల వెడల్పు, 30అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయి. వాటిని పునర్నిర్మాణం చేయడానికి చాలా సమయం పట్టేట్లు ఉంది. మరో 2 నెలల గడిచినా పనులు పూర్తయ్యే అవకాశం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు భక్తులు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!