Tirumala: టీటీడీ భక్తులకు గమనిక.. టోకెన్‌ల జారీ ఏప్రిల్ 8కి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల టీటీడీ ప్రకటించింది. అందుకు సంబంధించి గురువారం నాడు దర్శన టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టోకెన్ల జారీని టీటీడీ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది. ఆయా టోకెన్‌లను ఏప్రిల్ 8వ తేదీ ఉ.11 గంటలకు టోకెన్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ ఉ.10 గంటలకు, శుక్రవారం అయితే మ.3 గంటలకు భక్తులకు అనుమతి ఇవ్వనుంది. అటు అంగప్రదక్షిణం టోకెన్‌ల జారీని ఏప్రిల్ 2వ తేదీకి టీటీడీ వాయిదా వేసింది.
కాగా నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగే ఏడుకొండలు కరోనా ప్రభావంతో చరిత్రలో తొలిసారిగా 2020 మార్చి 20న శ్రీవారి దర్శనాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసింది. కరోనా కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తోంది. కల్యాణోత్సవ సేవను మాత్రం వర్చువల్‌గా నిర్వహిస్తోంది. ఇటీవల కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. అంతేకాకుండా వయో వృద్ధులకు, వికలాంగులకు కల్పించే దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!