Tirumala: తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం పలు కార్యాలయాలతో పాటు వసతి గృహాలు, గెస్ట్ హౌస్లు, క్యూ క్లాంప్లెక్స్లు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, వివిధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే తిరుమల వెళ్లే భక్తులు వీటికి వెళ్లే మార్గాలు తెలియక తికమక పడుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం టీటీడీ తిరుమల మార్గదర్శిని పేరుతో ఓ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకురానుంది. కొండపై ఒకచోటు నుంచి మరోచోటుకు సులభంగా వెళ్లేలా ఈ క్యూఆర్ కోడ్ సహాయం…
Muslim Couple Donation in Tirumala: తిరుమల శ్రీవారి ఖాతాలో భారీ ఎత్తున విరాళాలు చేరుతున్నాయి. ఇటీవల రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. తాజాగా చెన్నైకు చెందిన ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల భారీ విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ముస్లిం దంపతులు సుబీనా బాను, అబ్దుల్ ఘనీ తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఈ విరాళాన్ని అందించారు. ముస్లిం దంపతులు విరాళం తాలూకు చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు…
Tirumala Tirupati Devastanam: తిరుమలలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే అన్నదానం పేరుతో పలువురు భక్తులు భారీ స్థాయిలో విరాళాలను అందజేస్తున్నారు. కానీ కొందరు ప్రైవేట్ సంస్థలకు విరాళాలు అందిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు…
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి…
Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఒక రోజు, నవంబర్ నెలలో మరో రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5:11 గంటల నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.…