Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి…
Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఒక రోజు, నవంబర్ నెలలో మరో రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5:11 గంటల నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.…
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలికి అక్షింతలు వేసింది కన్స్యూమర్ కోర్టు… దర్శనం కేటాయింపు చేయనందుకు పరిహారంగా సంబంధిత భక్తుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు… అయితే, తమిళనాడు రాష్టం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు… మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ.12,250 చెల్లించారు.. కానీ, ఇప్పటి వరకు దర్శనం కల్పించలేదు టీటీడీ.. 17 సంవత్సరాలుగా పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు హరి…
తిరుమలలో నేడు వరాహజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిచనున్నారు. నేడు వరాహ జయంతి సందర్భంగా.. ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం చేయనున్నారు.. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్నది.…