నవంబర్ 1వ తేదీ నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 1వ తేదీ నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తాం.. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో టోకెన్లను జారీ చేస్తామని పేర్కొన్నారు.. ఏ రోజూ టోకెన్ల కోటాను ఆ రోజుకి మాత్రమే జారీ చేస్తాం.. సోమవారం, బుధవారం, శని, ఆదివారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లను విడుదల చేస్తామన్న ఆయన.. మంగళవారం, గురువారం, శుక్రవారం 15 వేల చొప్పున టోకెన్లను జారీ చేస్తామని ప్రకటించారు..
Read Also: CM KCR : నేడు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ ఆధారాలు బయటపెడతారా..?
ఇక, వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు ఈవో ధర్మారెడ్డి… 33 మంది పీఠాధితులకు ఆలయం తరుపున మర్యాదలు కల్పించే రోజుల్లో బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేస్తామన్న ఆయన.. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం సమయం మార్పును ప్రయోగత్మాకంగా అమలు చేస్తామన్నారు.. డిసెంబర్ నుంచి శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు తిరుపతిలోనే గదులను కేటాయిస్తామని.. అఫ్ లైన్ శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను తిరుపతిలోనే కేటాయిస్తామని వెల్లడించారు. మరోవైపు క్షురకుల ఆందోళనపై స్పందించిన ఈవో ధర్మారెడ్డి.. సీసీ కెమెరాల్లో క్షురకులను విజిలెన్స్ సిబ్బంది చేసిన తనిఖీలను చూశాం.. క్షురకుల పట్ల విజిలెన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.. ఆందోళన చేసిన క్షురకులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.