కొందరికి ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం. అది కూడా వరల్డ్ టూర్ లంటే వారు ఎంతో ఆసక్తి చూపిస్తారు. కొందరు విమానాల్లో విదేశీ ప్రయాణాలు పెట్టుకుంటారు.. వివిధ దేశాలను గిర్రుగిర్రున చుట్టేస్తారు. మరికొందరు బైక్ పై వివిధ దేశాలకు చేరుకుని అక్కడి వింతలు, విశేషాలు పంచుకుంటుంటారు. ప్రపంచ టూర్ లో భాగంగా ఓ ఎన్ఆర్ఐ భక్తుడు బైక్ లో తిరుమల కొండకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకి చెందిన 63ఏళ్ల మైఖేల్…బైక్ పై ప్రపంచం మొత్తం చుట్టాలని నిర్ణయించుకొని మూడేళ్ల క్రిత్తం బైక్ పై తన యాత్రను ప్రారంభించాడు.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన పాక్ హైకోర్టు.
మైఖేల్ తన బైక్ యాత్ర సాగిస్తుండగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. బైక్ పై నేపాల్ చేరుకోగా..ఆ సమయంలోనే కరోనా మహమ్మారి ప్రబలడంతో రెండేళ్ల పాటు నేపాల్ లోని వుండిపోయాడు. కరోనా ప్రభావం తగ్గడం, లాక్ డౌన్ లాంటి ఆంక్షలు ఎత్తివేయడంతో కొద్దిరోజుల క్రిత్తం భారతదేశం చేరుకున్నాడు. ఆధ్యాత్మిక క్షేత్రాలైన వారణాసి,పూరితో పాటు పలు క్షేత్రాలను సందర్శించాడు. అటు తరువాత బైక్ పై ఇవాళ కలియుగ వైకుంఠం తిరుమలకు చేరుకొని…ఆలయం వద్దకు వెళ్ళి బయట నుంచి స్వామి వారిని మొక్కుకున్నాడు.
అటు తరువాత తిరుపతికి బైక్ పై వెళ్ళిపోయాడు. తాను ఆరునెలలు పాటు భారత్ లో పర్యటిస్తానని అంటున్నాడు మైఖేల్. ఇప్పటికే 4వేల కిలోమీటర్లు బైక్ పై పలు ప్రాంతాలకు వెళ్లానని..20వేల కిలో మీటర్ల పాటు భారత్ లో తిరుగుతానని మైఖేల్ చెబుతున్నాడు. తిరుమల వాతావరణానికి మైఖేల్ ముగ్ధుడవుతున్నాడు.
Read Also: Shoaib Akhtar: ‘నో బాల్’ వివాదం.. షోయబ్ సంచలన వ్యాఖ్యలు