Tirumala: తిరుమల శ్రీవారి ఖాజానాకు నిత్యం విరాళాల రూపంలో కానుకలు అందుతూనే ఉంటాయి. ప్రతిరోజు కోట్ల రూపాయలలో శ్రీవారి హుండీకి ఆదాయం సమకూరుతుంది. ఇది కాకుండా శ్రీవారి ట్రస్టుకు దానధర్మాలు ఇచ్చే దాతలు కూడా ఉంటారు. వారు వస్తు లేదా ధన రూపేణా విరాళాలను టీటీడీకి అందజేస్తుంటారు. తాజాగా శ్రీవారి ఖజానాలో వాహనం కూడా చేరిపోయింది. హర్ష టయోటా షోరూం ఎండీ ఎం.హర్షవర్ధన్ వెంకటేశ్వరస్వామికి టయోటా రైడర్ కారును విరాళంగా సమర్పించారు. శుక్రవారం నాడు ఆలయం వద్దకు కారును తీసుకువచ్చిన హర్షవర్ధన్.. కారు తాళాలను ఆలయ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ మేరకు కారుకు పూజలు చేసి చక్కగా ముస్తాబు చేశారు.
Read Also: CM Jagan: మార్చి 31లోగా ఏపీలో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి
కాగా తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. తమిళ భక్తులు పోటెత్తడంతో తిరుమల కిక్కిరిసిపోయింది. తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం కావడంతో తమిళుల రద్దీ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్‌లు ఉండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. దీంతో సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం లేదు. రద్దీ తగ్గిన తర్వాత రేపు ఉదయం సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను అనుమతిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.