YV Subba Reddy: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఎలక్ట్రికల్ వాహనాలపై రాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్ షెడ్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్‌లపై రాయితీ అందిస్తామని వెల్లడించారు.. ఇక, టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన.. నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్ జారీ చేస్తామన్నాఉ.. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం టికెట్స్ సమయంలో మార్పులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వెల్లడించారు.. ముందుగా అనుకున్న విధంగా 10 గంటలు నుంచి 12గంటలు అనుకున్నాం, కల్యాణోత్సవం భక్తులు అదే సమయంలో ఉంటారు అనే సూచనతో కొద్ది మార్పులు చేశాం.. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించి పరిశీలిస్తామని తెలిపారు.
Read Also: APPSC: దేవదాయశాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల..
Also Read
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
మరోవైపు, టీటీడీ ఉద్యోగుల సంక్షేమం గురించి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశామని గుర్తు చేశారు.. కాగా, అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మా రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు పొకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.. నిన్న స్వామివారిని 67,439 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 29,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.60 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
తాజావార్తలు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
-
Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
-
India vs Japan: అదరగొట్టిన తెలుగు అమ్మాయి.. 57 పరుగులకే జపాన్ ఆలౌట్!
-
Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?