తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టులో సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశానన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు దగ్గర నుంచి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతాం అని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నాం.. విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం.
గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారన్నారు.
లడ్డూ వివాదంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ రోజురోజుకీ దిగజారిందని విమర్శించారు. అంతర్వేది రథం తగలబెట్టడం సహా అనేక ఘటనల్లో నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదన్నారు. కల్తీ నెయ్యి అంశం నిజమని, టెస్టు రిపోర్టులు వచ్చాయన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారన్నారు. ప్రసాదం తినేవారిలో అనుమానాలు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారన్నారు. యానిమల్ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.
Prakash Raj Again Targets Pawan Kalyan on Tirumala laddu Issue: తిరుమల లడ్డు వివాదం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చలు సాగుతున్నాయి. ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పవన్ ఫైర్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ తాను…
తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు.