తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసిందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇలాంటి నేరం ఎవరూ.. ఎప్పుడూ భగవంతుడు విషయంలో పాల్పడి ఉండరని వ్యాఖ్యానించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు.. టీటీడీని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నారు అంటూ మండిపడ్డారు..
తిరుమల లడ్డూల వివాదంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి ఆవేదన చెందాను అన్నారు.. అయితే, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చిన రమణధీక్షితులు టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం మహా పాపం అన్నారు.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యత, పరిణామాలు దిట్టం మేరకు జరగడం లేదని గత ఐదు సంవత్సరాలుగా తాను టీటీడీ ఈవో.. చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన సరైన స్పందన లేదని.. ఇప్పటికైనా వాటిని సరిదిద్దే…