Margani Bharat: చంద్రబాబు శ్రీవారి లడ్డూపై పెద్ద నింద వేశారు..
- వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు
- ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారు
- వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారన్నారు. జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసిందన్నారు. జులై నెలలో వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారన్నారు. ఎన్డీడీబీకి పంపించిన శ్యాంపుల్స్ రిపోర్ట్ జులై 23న వచ్చిందన్నారు. వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారని.. జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారన్నారు.
Read Also: Posani Krishna Murali: కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలి?
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారని.. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ మార్గాని భరత్ విమర్శించారు. నాలుగు ట్యాంకులు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారని తెలిపారు. 2014-19 మధ్య 14 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారన్నారు. 2019-24 మధ్య 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారన్నారు. చంద్రబాబుకు హిందుత్వం పట్ల.. హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా అని ప్రశ్నించారు. బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు…అదేనా హిందుత్వమంటే అంటూ వ్యాఖ్యానించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారని ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలన్నారు. సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారని.. పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనం చేసుకున్నారని ఆయన తెలిపారు. డిక్లరేషన్‌పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదన్నారు.
Read Also: Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా… తెలియక మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. NDDB నుంచి వచ్చిన నివేదిక….టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారన.. NDDB నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని.. మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే సిట్ అధికారులు అమలు చేస్తారని ఆరోపించారు. ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాయశ్ఛిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్‌కు తెలుసా అన్న ఆయన.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలని మార్గాని భరత్ అన్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!