CM Chandrababu: తిరుమలలో జరిగిన అపచారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొ్న్నారు. అపచారం ఎవరి వల్ల జరిగింది..? ఎందుకు జరిగిందనే అంశంపై విచారణ చేసి సిట్ నివేదిక ఇస్తుందన్నారు. టీటీడీలో జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా రేపు హోమం చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో.అక్కడి సంప్రదాయం ప్రకారం శుద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. Read Also: AP CM…
ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని.. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియజేశారు.
చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
టీటీడీ లడ్డూ ప్రసాదం మీద ఆరోపణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దాడులు చేయటం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పవన్ కల్యాణ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని ఆయన అన్నారు. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్‌బాబు పేర్కొన్నారు.
ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడే నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో..? మనం నిమిత్త మాత్రులం. దేవుడే అన్నీ చేయిస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న పవన్ కల్యాణ్.. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.