అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట గట్టిగా పాడింది వైసీపీ. కానీ... శృతి కుదరక మొదటికే మోసం వచ్చింది. గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు తత్వం బోధపడి ఇప్పుడు మళ్ళీ స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు తాము బాగా ప్రేమించిన విశాఖ వాసులు రాజధానిని ఓన్ చేసుకోలేకపోయారు, ఇటు కర్నూలు జిల్లా వాసులు అంతగా రియాక్ట్ అవలేదు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతికి అంకురార్పణ చేసింది. అందుకు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పింది. కానీ... 2019లో అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా యూ టర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీంతో... అప్పటికే ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కట్ చేస్తే... ఐదేళ్ళ తర్వాత సీన్ తిరగబడింది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు.. ఒక రాజధానిగా ఉన్నా.. ఇప్పుడే ఏ అధికారి దొరకడం లేదు.. మూడు రాజధానులు చేస్తే ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి..? అని నిలదీశారు.. కేంద్రం ఇచ్చిన నిధులను ఏమి చేస్తున్నారు? అని మండిపడ్డ ఆయన.. రాజధానిని మూడు…
Tammineni Sitaram: ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక కామెంట్లు చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ తీర్పు మళ్లీ న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసిందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. హైకోర్టును మీరు ప్రభుత్వమా.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు. భారతీయ రాజ్యాంగం చాలా గొప్పదని.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక…
Botsa satyanarayana: ఏపీలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని.. శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. మరి చంద్రబాబు ఒప్పంద పత్రంలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని.. ఏపీలోని అన్ని…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే తాను అన్నీ వదులుకుని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. జగన్ సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడని.. కానీ ఏమైందో అందరూ చూశారని.. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్తున్నాడని.. మళ్లీ వైసీపీ గెలిచి తీరుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు.…
Ambati Rambabu: అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తుందన్నారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థం అవుతోందని మంత్రి అంబటి అన్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత అయినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు విరామం తాత్కాలికం కాదని శాశ్వతం అని తాను…
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని…
భారత ప్రధాని నరేంద్ర మోడీతో వైజాగ్ పర్యటన ఆసక్తికరంగా మారింది.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రధాని పర్యటన సాగనుండగా.. ఇవాళ కీలక అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. రాత్రికి ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కాబోతున్నారు.. ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉన్నా.. ఈ మధ్య బీజేపీపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.. బీజేపీతో బంధం తెంచుకుని.. తెలుగుదేశం పార్టీకి మరోసారి పవన్ దగ్గర…