మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన…
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…
మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను…
సీఎం జగన్ పేదలందరికీ ఇళ్లు ఉండాలని 30 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వాటిలో ఇళ్ల నిర్మాణంకు సిఎం జగన్ శంకుస్థాపన చేశారని..ఆ కాలనీలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నారని వెల్లడించారు. కేంద్రం ఇంటి నిర్మాణానికి నిధులు కల్పిస్తుందని…భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రం చేస్తోందన్నారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ ను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించే చర్యలు తీసుకుందని తెలిపారు. సిఎం జగన్ అభిమతం అన్ని ప్రాంతాలను…