భారత ప్రధాని నరేంద్ర మోడీతో వైజాగ్ పర్యటన ఆసక్తికరంగా మారింది.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రధాని పర్యటన సాగనుండగా.. ఇవాళ కీలక అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. రాత్రికి ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కాబోతున్నారు.. ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉన్నా.. ఈ మధ్య బీజేపీపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.. బీజేపీతో బంధం తెంచుకుని.. తెలుగుదేశం పార్టీకి మరోసారి పవన్ దగ్గర అవుతున్నారా? అనే చర్చ కూడా సాగింది.. అయితే, ప్రధాని-పవన్ భేటీలో.. జనసేన-బీజేపీ పొత్తుపై మరింత క్లారిటీ రాబోతుందంటున్నారు.. ఇక, నరేంద్రుడితో బీజేపీ ఏపీ కోర్ కమిటీ కూడా భేటీ కానుంది.. రాత్రి ఎనిమిది గంటలకు ప్రధానితో ఏపీ బీజేపీ నేతలు సమావేశమై.. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు.. రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నారు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పనితీరు, మూడు రాజధానులు, జనసేనతో పొత్తు వంటి అంశాలను ప్రధాని మోడీ దగ్గర ప్రస్తావించనున్నారట ఏపీ బీజేపీ నేతలు. అంతేకాగు.. ప్రతిపక్షంగా తాము చేసిన కార్యక్రమాలను ప్రధానికి వివరించబోతున్నారు.
Read Also: Mexico Shooting: బార్‌లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
ప్రధాని మోడీ-బీజేపీ ఏపీ కోర్‌కమిటీ మీటింగ్‌లోనే జనసేనతో పొత్తు, మూడు రాజధానుల విషయంలో అనుసరించాల్సిన విధానంపై రాష్ట్ర నేతలకు ప్రధాని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇక, ప్రధాని మోడీతో సమావేశంపై బీజేపీ సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. ప్రధానితో బీజేపీ కోర్ కమిటీ నేతల భేటీ ఉంటుందని.. ఏపీ రాజకీయాల పరంగా ఇది చాలా కీలకమైన సమావేశంగా తెలిపారు. రాజకీయ అంశాలు చర్చకు రానున్నాయని.. మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు.. అయితే, అమరావతే ఏకైక రాజధాని అనేది బీజేపీ విధానమని మరోసారి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ-జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.. టీడీపీతో పొత్తుల అంశం మాత్రం ప్రధానితో జరిగే భేటీలో ప్రస్తావనకు రాదు.. ఇప్పుడే చెప్పేదేం ఉండదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంటును సెయిల్లో విలీనం చేయాలనేది మా ప్రతిపాదనగా తెలిపారు విష్ణకుమార్ రాజు.
అయితే, ఆది నుంచి అమరావతి రాజధానికే కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు.. దీంతో, రాజధాని అదే అని ఏపీ బీజేపీ నేతలు ఫిక్స్ అయ్యారు.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ సాగుతుండగా.. దీనిపై ఉద్యమాలు సభలు, సమావేశాలు, ర్యాలీలు కూడా నిర్వహిస్తుండగా.. రాజధానులపై బీజేపీ స్టాండ్ ఏమైనా మారుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, సార్వత్రిక ఎన్నికలను పవన్ కల్యాణ్‌తో కలిసే బీజేపీ ఎదుర్కోబోతోందా..? లేదా గతంలో మాదిరిగా.. టీడీపీని కూడా తమ జట్టులోకి ఆహ్వానిస్తుందా? అనేది కూడా వేచిచూడాల్సిన పరిణామమే.. మరి వీటి అన్నింటిపై ప్రధాని వైజాగ్ పర్యటనలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. మరోవైపు.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ బీజేపీకి మంచి సంబంధాలే ఉన్నాయి.. కీలక బిల్లుల విషయంలోనూ వైసీపీ సపోర్ట్ తీసుకుంది మోడీ సర్కార్. మరి, పవన్ ఓవైపు, టీడీపీ ఇంకోవైపు.. సీఎం జగన్ మరోవైపు అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో.. బీజేపీ స్టెప్ ఎలా ఉంటుంది? అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది.