ఏపీలో మూడురాజధానులకు కట్టుబడి వున్నామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులు అనేవి మా పార్టీ, ప్రభుత్వ విధానం. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. సమయాన్ని బట్టి సభలో బిల్లు పెడతాం. మూడు రాజధానుల విధానమే మా నిర్ణయం అన్నారు. మొదటి నుండి అదే చెప్తున్నాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం అని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? ఏదైనా పాజిటివ్ గా…
మూడు రాజధానుల అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. అదే తరహాలో మూడు రాజధానులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల విభజన చారిత్రాత్మకం, అభివృద్ధి దాయకం అని ఆయన తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు మరోసారి పెంపు తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా…
శుక్రవారం నాడు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక అఫిడవిట్లను సమర్పించింది. పాలన వికేంద్రీకరణ రద్దు, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై అఫిడవిట్లను ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అంశాలపై గతంలో పిటిషన్ దాఖలు చేసిన వారికి అఫిడవిట్ల కాపీలను ప్రభుత్వం పంపింది. ఈనెల 22న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్‌డీఏ బిల్లు చట్టాన్ని ఉపసంహరించుకుని బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదే బిల్లులను ఈనెల 23న శాసనమండలిలో కూడా ఆమోదించినట్లు ప్రభుత్వం…
ఏపీ రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలన్నది నాటి సీఎం చంద్రబాబు స్వప్నం. ప్రపంచ ప్రఖ్యాత నగరాలను పరిశీలించి రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేశారు. అయితే నిర్మాణం పనులు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కానీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియ మాత్రం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. వాటిలో కొన్ని ముందుకు వచ్చాయి. మరికొన్ని వచ్చే క్రమంలో ఉన్నాయి. ఈ లోగా రాజధాని భూ సేకరణలో అవకతవకల అంశం తెరమీదకు…
అనూహ్య నిర్ణయాలు.. సంచలన ప్రకటనలతో ప్రతిపక్షాలకే కాకుండా సొంత పార్టీకి.. కేబినెట్ సహచరులకు కూడా సీఎం జగన్ షాక్ ఇస్తున్నారా? మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయాలనే నిర్ణయం.. వేయి మెగావాట్ల షాక్ తగిలినట్టుగా మంత్రులు ఫీలయ్యారా? చివరి వరకు రహస్యం.. విషయం బయటకు పొక్కనీయకుండా తీసుకున్న జాగ్రత్తలతో మంత్రులందరికీ దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందా? సీఎం ఇచ్చిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని కొందరు మంత్రులు..? ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ చేసిన ప్రకటన…
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఈ మాట జగన్ అన్నారో లేదో వైసీపీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టేందుకు అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా…
మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ నిజంగా సంచలనమే. ఆందోళన చేస్తున్న రైతులు ఇది తమ విజయం అనుకున్నారు. ఈ చర్యను విపక్షాలు స్వాగతించాయి. బిల్లు ఉపసంహరణ హర్షణీయమని హర్షం వ్యక్తం చేశాయి. ఇది ఏడు వందల రోజుల పోరాట విజయం అన్నారంతా..కానీ, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువ లేదు. ఉపసంహరణపై సీఎం వివరణతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇది మోసం అంటూ ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు ఉపసంహరణ ఏపీ సర్కార్…
హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని… మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ఆగ్రహించారు జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర…
మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటన చేశారు. కొన్ని మార్పులతో మళ్లీ తీసుకువస్తామని చెప్పారు సీఎం జగన్. అసలు అసెంబ్లీ లో సీఎం జగన్ ఏం మాట్లాడారంటే… 1953 నుంచి 1956 వరకు ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆరోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేదన్నారు. ఆ తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధానిని కానీ, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు ఏ రకంగా తీసుకుని పోయారు, తీసుకుని…
అమరావతి : రాజధాని చట్టాల ఉప సంహరణ తాత్కాలికమేనని స్పష్టం చేశారు సీఎం జగన్. మళ్లీ మెరుగ్గా బిల్లు సిద్దం చేసి వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళతామని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని వర్గాలకు వివరించేందుకు.. బిల్లులు మరింత మెరుగు పరిచేందుకు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు వివరించేందుకు గతంలో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని… మళ్లీ సమగ్ర, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని పేర్కొన్నారు. విశాల ప్రజా ప్రయోజనాల కోసమే…