Bike Thieves: సూర్యాపేట జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. పార్క్ చేసిన వాహనాలనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బైక్ లే లక్ష్యంగా దోపిడీ చేసేందుకు పక్కా ప్లాన్ వేసి వాహనలను మాయం చేస్తున్నారు. దీంతో వాహన యజమానులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వాహనాలు పార్కింగ్ ఉండే వాటిని టార్గెట్ చేసి వారిని తీసుకుని వెళ్లేందుకు ముందుగా ప్లాన్ వేసుకుంటారు కిలాడీలు. ఆ తరువాత అర్ధరాత్రి, పగలు అనే తేడా లేకుండా పార్కంగ్ చేసిన ప్రదేశాల్లో ఎవరు లేని సమయంలో దర్జాగా వచ్చి వాహనాలను ఈజీగా దోచేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.
Read also: Secunderabad: సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రెండు బోగీల్లో మంటలు..
సూర్యాపేట జిల్లా విద్యానగర్ రమేష్ రెడ్డి హాస్పిటల్ వద్ద జరిగింది. పార్క్ చేసిన బైక్ ను కొందరు ఖిలాడీలు ఎత్తుకెళ్లిన ఘటన సూర్యాపేటలో సంచలనంగా మారింది. సీసీ కెమెరాకు దొంగతనం దృశ్యాలు చిక్కడంతో రంగంలోకి దిగారు పోలీసులు. బైక్ పై ఇద్దరు యువకులు వచ్చారు. అందులో వెనక కూర్చున ఒక యువకుడు బైక్ నుంచి కింది దిగి పార్కంగ్ చేసిన వాహనాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ నుంచి బయటకు ఒక వాహనంలో వచ్చాడు. బయట ఎవరైనా వస్తారేమో గమనిస్తు మరో యువకుడితో కలిసి రెండు బైకుల్లో దర్జాగా వెళ్లిపోయిన సీసీ ఫోటేజ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇద్దరు యువకులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
Read also: BJP Rally: కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాక.. భారీ ర్యాలీ..
మరోవైపు నల్లగొండ పట్టణంలో దొంగల హల్చల్ చేశారు. రాత్రి రైల్వే స్టేషన్ లో పార్క్ చేసిన మూడు బైక్ లు చోరీ చేశారు. ముషంపల్లి రోడ్డులో.. మహిళ మెడలో బంగారం గొలుసు చోరి చేసి పరార్ అయ్యారు. ఇక యాదాద్రి జిల్లా.. యాదగిరిగుట్టలో పార్కింగ్ చేసి ఉన్న రెండు బైక్ లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనే సూర్యాపేట విద్యానగర్ రమేష్ రెడ్డి హాస్పిటల్ వద్ద జరిగింది. పార్క్ చేసిన బైక్ ను కొందరు ఖిలాడీలు ఎత్తుకెళ్లిన ఘటన సూర్యాపేటలో సంచలనంగా మారింది. సీసీ కెమెరా కు చిక్కిన దొంగతనం దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TGPSC Group 4: నేటి నుంచి గ్రూప్ 4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. ఎప్పటి వరకు అంటే..