Robberies: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిసి కాలనీలో దొంగలు మంగళవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి బీభత్సం సృష్టించారు. జనసంచారం మధ్య జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది. వరుసగా మూడు ఇళ్ళలో చోరీకి పాల్పడిన దుండగులు 25 గ్రాముల బంగారం, 38 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ను అపహరించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరి కూడా లేకపోవడం దొంగలకు సులభంగా పని చేసింది. కాలనీలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అర్ధరాత్రి చాలా మంది ప్రజలు బయట ఉండటంతో ఈ దొంగతనం జరిగినది.
Also Read: New Year 2025: ఆశలు, ఆశయాలు నేరవేర్చుకుని.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి: సీఎం
అయితే కేవలం కొద్దిసేపటికే విషయం బయటకు వెలుగు చూసింది. దొంగలు ఎటు పారిపోయారు అనేది అర్థంకాకపోవడంతో, కాలనీ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. కాలనీ వాసులు సమాచారం అందించి ఆ తర్వాత పోలీసుల సహకారంతో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కాలనీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని వారు చెప్పారు. కాలనీ వాసులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రాంతంలో పోలీస్ పహారా ఉన్నా, ఇలాంటి ఘటనలు సంభవించడంతో భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు దొంగలను త్వరగా పట్టుకోవాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.