Kurnool Crime: దొంగలు తెలివి మీరిపోతున్నారు.. ఎక్కడైనా వెళ్లే.. డబ్బులు దొరుకుతాయే లేదో.. కానీ, ఏటీఎం మిషన్‌లోనే చోరీ చేస్తే.. ఖచ్చితంగా డబ్బు దొరుకుతుందనేమో.. ఏటీఎం మిషన్లను టార్గెట్ చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో చోట్ల ఏటీఎంల దొంగతనం జరిగింది. కొన్ని చోట్ల దొంగల విజయవంతం అయినా.. చాలా చోట్ల విఫలమైన ఘటనలే ఎక్కువుగా ఉన్నాయి.. తాజాగా, కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన ఏటీఎంను పెకిలించిన దుండగులు.. టోయింగ్ వాహనంలో తరలిస్తుండగా.. స్థానిక యువకులు గమనించి అడ్డుకున్నారు. కర్నూలులో సినిమా చూసి చిన్నటేకూరుకు వెళ్లగా ఐచర్ వాహనంలో ఏటీఎం తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అది చూసిన యువకులు.. కేకలు వేయడంతో.. భయపడి ఏటీఎంను కింద పడేసి ఐచర్ వాహనంలో పరారయ్యారు దుండగులు. ఇక, ఆ వాహనాన్ని కూడా హైవేలో వదిలి పరారయ్యారు. యువకులు అప్రమత్తతతో ఏటీఎం చోరీ ప్రవత్నం విఫలమైంది. ఇక, నిన్న కర్నూలులో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు దొంగలు.. ఎస్బీఐ కేంద్ర కార్యాలయంలో గమనించి కర్నూలు పోలీసులను అలర్ట్ చేశారు అధికారులు. కర్నూలులో బ్లూ కోర్టు పోలీసులు వెళ్లడంతో దొంగలు పరారయ్యారు.