Tesla Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ ఛాన్స్ లను అందిపుచ్చుకోవడానికి ఈ ఏడాది ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్, అమెరికన్ కంపెనీ టెస్లా వేర్వేరు స్ట్రాటజీలతో కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. అయితే, విన్‌ఫాస్ట్, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2025లో తమ కార్లను ప్రదర్శించింది.
ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్ లో తన మొదటి డెలివరీని ప్రారంభించింది. టెస్లా జూలై 15న తన ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ SUV, టెస్లా మోడల్ Yని విడుదల చేయడంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ధర సుమారు రూ. 60 లక్షలు. జూలై 15న ప్రారంభించబడిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ‘టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్’లో మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ వైట్ కలర్ మోడల్ Y కారును డెలివరీ తీసుకుంటున్నట్లు…
Tesla Fined: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ లోపమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది.
జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని…
Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
Elon Musk: ప్రధాని నరేంద్రమోడీతో బిలయనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇరువురు మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీతో మాట్లాడిన ఒక రోజు తర్వాత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో తాను ఇండియాకు వస్తానని, ఈ పర్యటనపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాల నిర్ణయం శాశ్వతమని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ దేశంలో తయారు కాని అన్ని కార్లపై అమెరికా 25% సుంకాన్ని సమర్థవంతంగా విధిస్తుందని ట్రంప్ అన్నారు. యూఎస్‌లో తయారైన కార్లకు ఎటువంటి సుంకం ఉండదని ఆయన అన్నారు. ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుంది. దాని పునరుద్ధరణ ఏప్రిల్…
టెస్లా కార్ల సంస్థకు అమెరికాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూమ్‌కి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో పలు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్‌లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని…
Tesla : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానసపుత్రిక టెస్లా ఇప్పుడు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. టెస్లా భారతదేశంలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది.