ఎలక్ట్రిక్ కార్ల రారాజు టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను విపణిలోకి తీసుకొచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నది. అదుగో ఇదుగో అంటున్నా ఇప్పటి వరకు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేదు. డ్రైవర్‌లెస్ కార్లపై పలు అనుమానాలు ఉండటంతో ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కాగా, అయితే, టెస్లా కంపెనీ ఆటోపైలట్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తూనే మరో కొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. అదే వీడియో గేమ్ ఫీచర్. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న…
క్షణాల్లో కోట్లు సంపాదించే తెలివైన వ్యక్తి ఎలన్ మస్క్. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా పనులు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎలక్ట్రానిక్ కార్ల రంగంతో పాటుగా మస్క్ అంతరిక్షరంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. ఇతర గ్రహాలపైకి మనుషులను పంపించడమే లక్ష్యంగా ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ పనిచేస్తున్నది. అయితే, అనూహ్యంగా టెస్లా షేర్లు భారీగా పెరడగంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించాడు. Read: ఫ్యాక్ట్స్: జనాభా కంటే ఆ దేశాన్ని సందర్శించేవారే ఎక్కువ… 300 బిలియన్ డాలర్ల…
ప్రపంచ కుబేరుడిగా ఇప్పటి వరకు కొనసాగిన అమెజాన్ జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పడిపోయాడు. చాలా కాలంగా బెజోస్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలన్ మస్క్ పోటీ ఇస్తున్నాడు. శుక్రవారం రోజున మస్క్ కు రెందిన మస్క్ కంపెనీకి లక్ష కార్ల ఆర్డర్ రావడంతో మార్కెట్లో ఆయన షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే 31,100 కోట్ల రూపాయల సంపద పెరిగింది. 300 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించాడు. కాగా, రెండో…
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న టెస్లా కార్ల హెడ్ క్వార్టర్స్‌ను అక్కడి నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నది. టెస్లా సీఈవో తీసుకున్న అనూహ్యమైన నిర్ణయంతో క్యాలిఫోర్నియాలోని అటోమోబైల్ రంగంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఎందుకని టెస్లా హెడ్ క్వార్టర్స్ ను మార్చాలి అనుకుంటుంది అనే దానిపై అనేకమైన సందేహాలు కలుగుతున్నాయి. కంపెనీ విస్తరణలో భాగంగానే హెడ్ క్వార్టర్స్‌ను తరలిస్తున్నట్టు ఎలన్…
ఎలన్ మస్క్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష సంస్థను స్థాపించి స్పేస్ గురించిన పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాసాతో కలిసి అనేక ప్రాజెక్టులను స్పేస్ ఎక్స్ సంస్థ చేపడుతున్నది. రాబోయే రోజుల్లో ఎలాగైనా భూమి నుంచి మనుషులను అంగారకుడిపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్సేష్ షిప్ ను తయారు చేస్తున్నారు. ఈ స్పేస్ షిప్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రీయూజబుల్ స్పేస్‌షిప్ ద్వారా 100 మందిని అంగారకుడిమీదకు…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు కొన్ని దేశాలకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ సమస్య అధికంగా ఉన్నది. కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అధికారులు, వ్యాపాదవేత్తలు, సామాజికవేత్తలు వ్యాక్సినేషన్ కోసం భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని, మిలియన్ డాలర్ల నగదును అందజేస్తామని ప్రకతిస్తున్నారు.…