Tesla Cars: టెస్లాకు గిరాకీ నిల్.. అక్టోబర్లో అమ్మింది కేవలం 40 కార్లే..
- భారత్ లో అత్యంత వేగంగా విస్తరిస్తూన్న ఎలక్ట్రిక్ వెహికల్స్..
- ఇండియాలోకి ప్రవేశించిన టెస్లా కార్ల కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపించని కస్టమర్లు..
- అక్టోబర్ నెలలో కేవలం 40 కార్లను మాత్రమే విక్రయించిన టెస్లా షోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ ఛాన్స్ లను అందిపుచ్చుకోవడానికి ఈ ఏడాది ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్, అమెరికన్ కంపెనీ టెస్లా వేర్వేరు స్ట్రాటజీలతో కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. అయితే, విన్‌ఫాస్ట్, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2025లో తమ కార్లను ప్రదర్శించింది. అనంతరం సెప్టెంబర్ 6వ తేదీన వీఎఫ్6, వీఎఫ్7 SUVలను రూ.16.49 నుంచి రూ.25.49 లక్షల ధరల దగ్గర రిలీజ్ చేసింది. అక్టోబర్‌లో కంపెనీ 131 వాహనాలు సేల్ చేయగా, ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్ పోర్టల్ ‘వాహన్’ ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 204 రిజిస్ట్రేషన్లు చేసింది. అయితే, తమిళనాడులో ఫ్యాక్టరీ, 27 నగరాల్లో 35 షోరూమ్‌లను ఏర్పాటు చేయడంతో కంపెనీ బ్రాండ్ గుర్తింపును త్వరగానే పెంచుకునే పనిలో పడింది. విన్‌ఫాస్ట్ లోకల్‌గా ఈవీలను తయారు చేసి, తక్కువ ధరలకే కార్లను అమ్ముతూ మార్కెట్‌లో పట్టు సాధించుకునేందుకు ప్లాన్ వేసింది.
Read Also: SSMB 29 : GlobeTrotter ఈవెంట్.. మీడియా కెమెరాలకు నో ఎంట్రీ
Also Read
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
నెమ్మదించిన టెస్లా అమ్మకాలు?..
అయితే, టెస్లా పూర్తిగా దిగుమతులపై ఆధారపడి అమ్మకాలు చేస్తుంది. ఈ ఏడాది మధ్యలో మోడల్ Y ద్వారా భారత్ లోకి ప్రవేశించిన ఈ కంపెనీ, అక్టోబర్‌లో కేవలం 40 కార్లే సేల్ చేసింది. ప్రస్తుతం టెస్లా ఒక్క మోడల్ Y కారునే విక్రయిస్తుండగా, దీని ధర రూ.59.89 నుంచి రూ.67.89 లక్షలుగా ఉంది. టెస్లా ఇంకా లోకల్‌గా అసెంబ్లింగ్‌ని స్టార్ట్ చేయకపోవడం, కంపెనీ స్టోర్లు కూడా ముంబై, ఢిల్లీలకే పరిమితం కావడంతో, విన్‌ఫాస్ట్ లాగా స్పీడ్ గా విస్తరించలేకపోయింది. ఇక, టెస్లా కార్ల దిగుమతుల ద్వారా మాత్రమే విక్రయాలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. జీఎస్‌టీ మార్పులతో పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను తగ్గించినప్పటికీ, ఈవీలపై 5 శాతం సుంకం కొనసాగుతోంది. దీంతో జీఎస్‌టీ 2.0 ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపుపై చూపించలేదు. మరోవైపు హ్యుందాయ్, మారుతి, కియా, జేఎస్‌డబ్ల్యూ లాంటి సంస్థలు కూడా లోకల్‌గా ఈవీ అమ్మకాలను పెంచేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.
Read Also: MP Bharat: పెట్టుబడులు రావడం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకీ ఇష్టం లేదు..!
ఈవీ జోష్: అమ్మకాల్లో 57.5% వృద్ధి
కాగా, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్‌లో 18,055 యూనిట్లకు వేగంగా చేరుకుంది. 2023 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 57.5% వృద్ధి (2023 అక్టోబర్‌లో 11,464 ఎలక్ట్రిక్ కార్లు) చెందింది. అయితే, గత నెలలో టాటా మోటార్స్ 7,239 ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు జరపగా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ 4,549 కార్లు, మహీంద్రా 3,911 కార్లను విక్రయించాయి. ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు కూడా అక్టోబర్‌లో 105.9 శాతం పెరిగాయి.
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?