Elon Musk: మోడీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత్‌కి వస్తా..
- ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటం గొప్ప గౌరవం..
- ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..
- టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రధాని నరేంద్రమోడీతో బిలయనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇరువురు మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీతో మాట్లాడిన ఒక రోజు తర్వాత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో తాను ఇండియాకు వస్తానని, ఈ పర్యటనపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
Read Also: Earthquake: ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఢిల్లీలో భూప్రకంపనలు
Also Read
సుంకాలపై భారత్, అమెరికా చర్చలు జరుపుతున్న సమయంలో మస్క్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రస్తుతం ఇరు దేశాలు కూడా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకునే దిశలో ఉన్నాయి. అంతకుముందు, ప్రధాని మోడీ ఎక్స్‌లో తాను టెక్ బిలియనీర్ మస్క్‌తో మాట్లాడానని, సాంకేతికత, ఆవిష్కరణల సహాకారంలో అపారమైన సామర్థ్యాలపై చర్చించామని చెప్పారు. మరోవైపు, ఏప్రిల్ 21-24లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వన్స్ పర్యటన కూడా ఉండబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు.
మరికొన్ని నెలల్లో టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ముంబైకి వేల సంఖ్యలో కార్లను దిగుమతి చేయనున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ముంబై, ఢిల్లీ, బెంగళూర్లలో అమ్మకాలు ప్రారంభించాలని టెస్లా యోచిస్తోంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!