టెస్లా కార్ల సంస్థకు అమెరికాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూమ్‌కి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో పలు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే ఒక కారుపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ స్పందిస్తూ.. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Telangana Budget 2025: మంత్రిత్వ శాఖల వారీగా ఏ శాఖకు ఎంత కేటాయించారంటే?
ఎలోన్ మస్క్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడిగా ఉంటున్నారు. ప్రభుత్వ పెత్తనాల్లో మస్క్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యయాల కట్టడి చేయడం కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీను ట్రంప్ ఏర్పాటు చేశారు. దీన్ని మస్కే చూసుకుంటున్నారు. ఇటీవల వేల మంది ఫెడరల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. దీంతో మస్క్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనపై చాలా మంది గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రక్రియలో భాగంగానే ఆయన కార్లు షోరూం తగలబెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ 3.04 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా..
ఇక ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు మూల కారణం ఏంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మస్క్ ఆరోపించినట్లుగా ఉగ్ర చర్యపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.