TESLA: భారత్‌లో టెస్లా తొలి షోరూం.. స్థలాన్ని అద్దెకు తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?
- భారత్‌లోకి టెస్లా ఎంట్రీ
- ముంబైలో తొలి షోరూం
- స్థలాన్ని అద్దెకు తీసుకున్న కంపెనీ
- ఏప్రిల్‌లో అందుబాటులోకి టెస్లా కార్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్‌లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
READ MORE: Hyderabad: 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో..
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించడానికి ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. ప్రాపర్టీ మార్కెట్ వర్గాలను ఉటంకిస్తూ ఈ అంశాన్ని ఇండియా టుడే నివేదిక పేర్కొంది. టెస్లా కంపెనీ బీకేసీలోని వాణిజ్య కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ. 900 అని చెబుతున్నారు. అంటే నెలకు దాదాపు రూ. 35 లక్షలు.
READ MORE: Amit Shah: ఇక ఉపేక్షించకండి.. మణిపుర్ పరిస్థితిపై అమిత్ షా కీలక ఆదేశాలు..
టెస్లా ఈ స్థలాన్ని 5 సంవత్సరాలకు గానూ అద్దెకు తీసుకుంది. ఇక్కడ కంపెనీ తన విస్తృత శ్రేణి కార్లను ప్రదర్శిస్తుంది. అన్నీ సరిగ్గా జరిగితే.. కంపెనీ ఏప్రిల్ నుంచి కార్ల అమ్మకాలను ప్రారంభించవచ్చు. ముంబైతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా టెస్లా షోరూమ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం ఆ కంపెనీ ఢిల్లీలోని ఏరోసిటీలో షోరూమ్ కోసం స్థలం కోసం వెతుకుతోంది. అయితే, దీని గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు.
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!