Tesla Fined: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ లోపమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బాధితులకు పరిహారం చెల్లించాలని కంపెనీకి ఆదేశాలను జారీ చేసింది. దీంతో బాధితులకు 242 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2,100కోట్లు) చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. ఆనాటి ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Boda Kakarakaya: బోడకాకరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
2019లో ఘటన..
2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్జ్ మెక్‌గీ అనే వ్యక్తి టెస్లా కారును అధునాతన ఆటోపైలట్ మోడ్‌లో నడిపిస్తున్నాడు. మార్గమధ్యంలో అతని మొబైల్ ఫోన్ కిందపడి పోవడంతో దాన్ని తీసుకోవడానికి కిందకు వంగాడు. కారు ఆటోపైలట్‌లో ఉందని భావించిన మెక్‌గీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కన పార్క్ చేసిన వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. కాగా, ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే చనిపోగా.. ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమయంలో యువతి మృతదేహం 75 అడుగుల దూరంలో ఎగిరి పడిందని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.
Read Also: East Godavari: ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు.. కలెక్టర్ ఆదేశాలతో గుట్టు రట్టు..!
ఫ్లోరిడా కోర్టు తీర్పు..
అయితే, సుదీర్ఘ విచారణ తర్వాత ఫ్లోరిడా కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. బాధిత కుటుంబాలకు మొత్తం 329 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిహారంలో మూడో వంతు అంటే 242 మిలియన్ డాలర్లు టెస్లా కంపెనీ చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొనింది. మిగిలిన మొత్తం డ్రైవర్ జార్జ్ మెక్‌గీ భరించాల్సి ఉందని చెప్పుకొచ్చింది.
కోర్టు తీర్పుపై టెస్లా స్పందన..
ఫ్లోరిడా కోర్టు తీర్పుపై టెస్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆటోపైలట్ వ్యవస్థ సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని న్యాయస్థానం గుర్తించిన ఈ తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.