ఇటీవల జమ్మూకాశ్మీర్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు.
లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్ జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు, ఒక జవాన్‌తో పాటు ఎల్‌ఈటీ ఉగ్రవాది జియా ముస్తఫాకు కూడా గాయాలయ్యాయి.