దేశంలో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. గతంలో సైనికులను టార్గెట్ చేసుకొని దాడులు జరిపే ఉగ్రవాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మణిపూర్‌లోనూ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయక పౌరులు మృతి చెందారు. దీంతో బధ్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read: హుజురాబాద్: నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు… పెరుగుతున్న ఉత్కంఠత