ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్రలు కూడా చేసినట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సిద్ధికి బిన్ ఉస్మాన్, ఫుర్ఖాన్ సంబంధాలు పెట్టుకున్నట్టు.. అయితే, 2012లో అక్రంతో పాటు పలువురు ఉగ్రవాదులు ముంబైలో అరెస్ట్ అయ్యారు.. ముజామిల్, సాదిక్‌కు అక్రమ్ ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చినట్టు గుర్తించారు.. 2012లో హైదరాబాద్ లో అక్రమ్ సన్నిహితుడు ఒబాయిధ్ రెహ్మాన్ ను కలవడానికి సాదిక్, ముజానిల్ వచ్చినట్టు కూడా తేల్చారు.. ఈ కేసులు అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ముగ్గురు ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.