భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత్‌లోని చొరబడేందుకు 40మంది ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మద్ధతుతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చిరించాయి. జమ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దేశంలో రాబోయే పండగ రోజుల్లో దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు ముందస్తు హెచ్చరికలు చేయడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇక, జమ్మూకాశ్మీర్‌లో ఈరోజు పాక్‌నుంచి ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
Read: ఆసియాలోనే మొదటి ఎగిరే కారు… ఇండియాలోనే తయారి… ఎక్కడంటే…