కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది, ఇది జిల్లా కలెక్టర్, వికారాబాద్ యొక్క మొత్తం నియంత్రణలో పనిచేయడానికి.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి…
కొత్త సంవత్సరం సంబరాలు సంతోషంగా జరుపుకోవాలని, వాహన దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే..కటిన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్. డ్రంకెన్ డ్రైవింగ్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ..ప్రాణాలు తీసుకోవద్దని సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పోలీస్ ల శిక్షల కంటే.. వాహన దారుల్లో మార్పులు రావాలన్నారు. బార్ లు , పబ్బుల వద్ద సరిఅయిన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ఎన్టీ ఆర్ ఘాట్ , నక్లేస్…
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు.
విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సహా పలు రహదారులు మూసివేయనున్నారు. 31 రాత్రి 8గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్ నుంచి NAD జంక్షన్…
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో…
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు హడావిడిగా వెళ్లవద్దని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కోరారు.
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు ద్రోహి జగన్ రెడ్డికి వంత పాడేందుకు శేషు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కాపులకు ఏం చేశారో అడపా శేషు సమాధానం చెప్పగలడా? అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ప్రశ్నించలేని స్థితిలో అడపా శేషు ఉన్నాడని ఆరోపించారు. ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు..? అని ప్రశ్నించారు. ఎంత మందికి విదేశీ విద్య ఇచ్చారో అడపా…
తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా…
వానాకాలం, యాసంగి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ డా.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో కష్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) వానాకాలం, యాసంగి పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వానాకాలం, యాసంగి 2022-23 కు సంబంధించి…
ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలోని హమాస్‌కు భారీ నష్టం కలిగించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 158 మంది గాయపడ్డారు.