Attack on Minister Office: మంత్రి విడదల రజినీ కార్యాలయంపై దాడి.. 30 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on Minister Office: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. మంత్రి కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ-జనసేన కార్యకర్తలు అని పోలీసులు తెలిపారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన వైసీపీ ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా దాడులను ఆపలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు.
Read Also: Ambati Rambabu: మంత్రి విడదల రజనీ ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి దుర్మార్గం
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ… ‘అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండా తో జగనన్న పాలన సాగిస్తున్నారు. జగన్ ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్తగా పని చేస్తున్నాను. గుంటూరు అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తా. పశ్చిమలో ప్రతి ఒక్కరూ సొంత ఆడపడుచులా ఆదరిస్తున్నారు. గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరవేయాలి. మన కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారు. రాళ్లతో మన కార్యాలయాన్ని పగలగొట్టారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమలో అలజడి సృష్టిస్తున్నారు. వైసీపీ కుటుంభం అప్రమత్తంగా ఉండాలి. రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి’ అని అన్నారు.
Read Also: Visakha: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
‘మాకు రౌడీ యిజం చేసే అలవాటు లేదు. అధికారం కోసం బీసీ మహిళపై దాడి చేస్తారా?. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మంత్రిగా ఉన్న బీసీ మహిళపై దాడులు చేస్తున్నారంటే.. అధికారం వస్తే టీడీపీ ఏం చేస్తుందో ప్రజలు ఆలోచించాలి. దాడి చేయటం పెద్ద పని కాదు కానీ మాది ఆ సంస్కారం కాదు. ప్రజల మనసులో వైసీపీకి స్థానం ఉంది. ప్రజా బలంతో వైసీపీ పశ్చిమలో విజయం సాధిస్తాం. మీరు భయపెడితే భయపడే రకం కాదు నేను’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ‘సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గుంటూరు పశ్చిమలో అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలో అదే చేసాం. మా సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఒక బీసీ మహిళ ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించకూడదా?.. ఆ హక్కు మాకు లేదా?. మీ ప్రతాపం ఏదైనా ఉంటే ప్రజలకు మేలు చేయడంలో చూపించండి. అంతేకాని దాడులు చేసి బెదిరించాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం’ అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!