Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 సంవత్సరం మొదటి రోజున సీమా హైదర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతోంది. ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా, సచిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే శుభవార్త అందిస్తాం’’ అని సీమా హైదర్ అన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సీమకు ఇది ఐదవ సంతానం. అంతకు ముందు.. ఆమెకు తన మొదటి భర్తతో నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా సీమతో కలిసి ఇండియా వచ్చి గ్రేటర్ నోయిడాలోని సచిన్ ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. సీమ మాట్లాడుతూ.. నేను ఎప్పుడు తల్లి అవుతానో తెలియదు.. కానీ సచిన్‌కి, తనకు కచ్చితంగా బిడ్డ పుట్టడం ఖాయమని తెలిపింది.
Read Also: Muhammad Yunus: నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్‌కు 6 నెలల జైలు శిక్ష
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
కాగా.. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఆన్‌లైన్‌లో PUBG గేమ్ ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. గతేడాది సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత ప్రయాణ ఆంక్షల షరతులతో వారిని విడుదల చేశారు. సీమా, సచిన్ ల ప్రేమ వ్యవహారం భారత్, పాకిస్తాన్ మధ్య చర్చనీయాంశమైంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఈ విషయంపై ఆసక్తి చూపారు.
Read Also: Tollywood: కొత్త సంవత్సరం.. కొత్త పోస్టర్లపై ఓ లుక్ వేయండి
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..