అమెరికాలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. వారి మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో మసాచుసెట్స్‌లో వారి విలాసవంతమైన భవనంలో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు, వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో సిమెంట్ బస్తాలను తీసుకెళ్తున్న ట్రక్కు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. సమీపంలో ఆగి ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు.
Ponnam Prabhakar: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది.
ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా విష్ణు వారియర్ సేవలందించనున్నారు. కాగా.. విష్ణు వారియర్‌ను స్టేట్ సర్వీస్ నుంచి వెంటనే రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా.. ప్రస్తుతం ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా విష్ణు వారియర్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృత్తం కాకుండా నేడు చర్యలు తీసుకోవడంపట్ల అభినందనలు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి జరిగిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన వారం తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
పాములు ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిన విషయమే.. సాధారణంగా పాములను చూస్తే భయపడే వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అవి కాటు వేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది కనుక.. వాటికి దూరంగా ఉంటారు. మరికొందరైతే పాములతో విన్యాసాలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఈరోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమని ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పాముకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో నాగుపామును చేతిలో ఉంచుకుని దాని చర్మాన్ని…
పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించింది.
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పదిరోజుల వ్యవధిలో ఫిలింనగర్ లో రెండోసారి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని బెంగళూరుకు చెందిన క్యాప్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారంతో పబ్ పార్కింగ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అధికారులు. మరోవైపు.. బాబు కిరణ్…
ఖతార్ కోర్టు భారత మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను తగ్గించిన తర్వాత, ప్రభుత్వం ఈ కేసులో పెద్ద అప్డేట్ ఇచ్చింది. దీనిపై న్యాయ బృందంతో చర్చిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.