Sankranti 2027 Box Office Clash : 2027 సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద భారీ మల్టీస్టారర్లు, క్రేజీ కాంబినేషన్ల మోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సినిమాల జాతర. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఇప్పటికే పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు, భారీ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి రేసులో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన సినిమాలను ఓసారి చూస్తే..
-
వెంకటేష్ – కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి : సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కత్తిలాంటి ఐడియాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
- Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
- Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
- Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
-
సాయి ధరమ్ తేజ్ : ‘హను-మాన్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
-
రవితేజ – శ్రీవిష్ణు – దిల్ రాజు : మాస్ మహారాజా రవితేజ కామెడీ అండ్ విలక్షణ నటనకు పేరుగాంచిన శ్రీవిష్ణు కాంబినేషన్లో ఒక హిలేరియస్ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు.
-
శర్వానంద్ – శ్రీను వైట్ల –జార్జ్ క్రిష్ :‘సంక్రాంతి హీరో’గా పేరున్న శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ‘జార్జ్ క్రిష్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
-
కార్తి – కళ్యాణ్ శంకర్ – సితార ఎంటర్టైన్మెంట్స్: కోలీవుడ్ స్టార్ కార్తి దశాబ్దం తర్వాత నేరుగా నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది. ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్న ఈ రోలర్ కోస్టర్ కామెడీ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతి బరిలోనే నిలవనుంది. ఇప్పటికే ఈ ఐదు సినిమాలు 2027 సంక్రాంతికి రావడం దాదాపు ఖాయం కాగా, పండుగ దగ్గరపడే కొద్దీ మిగతా స్టార్ హీరోలు లేదా దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ల నుండి మరికొన్ని సర్ప్రైజ్ అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
-
Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
-
AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
-
Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
-
Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
ట్రెండింగ్
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!