రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే.. మగవాళ్లతో స్నేహం చేయటమే ఆడవారు చేస్తున్న నేరమా అనిపిస్తోంది. కొంచెం మంచిగా నటించి మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌పై సిమ్లాలోని లూథియానాకు చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను నిండా ముంచారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిశీలన, అవగాహణకు రివ్యూ నిర్వహించారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ చేతిలో పెడితే అభివృద్ధి చేసిందేమీ లేదని.. అన్ని రంగాలను ఆందోళన కలిగించే దృస్థితికి తెచ్చారని అన్నారు. అంకెలు, సంఖేలు ఆందోళనకరంగా వుందన్నారు. లెక్కలు చూస్తే ఆశ్చర్యకరంగా వుందని, పవర్ సెక్టార్ 81,516 కోట్ల రూపాయలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వ. నుంచి డిస్కంలకు…
జనవరి 1 నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్-2024) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని నుమాయిష్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.
న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త స్టెప్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌ను రంగంలోకి దించింది నార్కోటిక్ టీం. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సుకన్య సమృద్ధి యోజన, ప్రభుత్వ పొదుపు పథకం "బేటీ బచావో, బేటీ పడావో" చొరవలో కీలకమైన భాగం. ఆడపిల్లల ఉద్ధరణ, సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోడ్‌షో నిర్వహించి పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆవిష్కరించిన అనంతరం కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ కోసం అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలను నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభినందించారు. భారతదేశంలో సోదరభావం తగ్గిపోతోందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.