బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు వివరాలను క్యాబినెట్ సెక్రటేరియట్ విడుదల చేసింది. 2023 డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన ఈ ప్రకటనలో.. చర, స్థిరాస్తి నుండి రుణాల వరకు ప్రతిదీ చర్చించబడింది. సీఎం నితీష్ కుమార్ కు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయి. అతని వద్ద రూ.22,552 నగదు, రూ.49,202 వివిధ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. కాగా.. ఈసారి నితీష్ కుమార్ తన కుమారుడి పేరు మీద ఉన్న ఆస్తి గురించి సమాచారం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. నితీష్ ప్రభుత్వంలో నితీష్ కుమార్ కంటే ధనవంతులైన 28 మంది మంత్రులు ఉన్నారు.
Read Also: Covid Cases: ఇండియాలో ఇప్పటివరకు 196 సబ్ వేరియంట్ కేసులు నమోదు..
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు రూ. 11.32 లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, రూ. 1.28 లక్షల విలువైన రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం, అలాగే రూ. 1.45 లక్షల విలువైన 13 ఆవులు, 10 దూడలు, ట్రెడ్‌మిల్, వ్యాయామ సైకిల్, ఒక సైకిల్ వంటి ఇతర చరాస్తులు కూడా ఉన్నాయి. మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఉంది. న్యూఢిల్లీలోని ద్వారకలో 2004లో రూ.13.78 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.1.48 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ మాత్రమే సీఎం నితీశ్‌కుమార్‌కు చెందిన ఏకైక స్థిరాస్తి అని సమాచారం.
Read Also: Holalkere Anjaneya: సిద్ధరామయ్య మా రాముడు.. అయోధ్యలో ‘బీజేపీ రాముడు’ని ఎందుకు పూజించాలి?..
కాగా.. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆస్తుల విలువ రూ.6.24 కోట్లు ఉంది. రూ.50 వేలు నగదు, రూ.1.76 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4.48 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నితీష్ కేబినెట్ లో జామా ఖాన్ అత్యంత పేదమంత్రి. ఆయన ఆస్తుల విలువ రూ.68.60 లక్షలు. మరో మంత్రి ఇజ్రాయెల్ మన్సూరి. ఆయనకు రూ.1.10 కోట్ల ఆస్తులున్నాయి. అంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటే తక్కువ ఆస్తులున్న ఇద్దరు మంత్రులు వీరే.