Rajinikanth: ధర్మన్ సెట్స్‌లో ప్రత్యేక వేడుక.. రజనీకాంత్ 51 ఏళ్ల సినీ ప్రయాణం సెలబ్రేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: భారతీయ చిత్రసీమలో ఐదు దశాబ్దాలకు పైగా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. నటుడిగా సినీ రంగంలో 51 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న ధర్మన్ సినిమా సెట్స్‌లో చిత్రబృందం శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించింది. కేక్ కట్ చేస్తూ రజనీ సహనటులు, టెక్నీషియన్లతో కలిసి ఈ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే పేరు, ఒకే సూపర్‌స్టార్ అనే క్యాప్షన్ జోడించి రజనీకాంత్ 51 ఏళ్ల సినీ ప్రయాణానికి నివాళి అర్పించింది చిత్రబృందం. ఈ వేడుకలో సిమ్రాన్ బగ్గా, రాశి ఖన్నా, దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
రజనీకాంత్ సినీ ప్రయాణం 1975 ఆగస్టు 15న ప్రారంభమైంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రలు చేసిన రజనీ, తర్వాత హీరోగా ఎదిగి ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా నిలిచారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన సృష్టించిన క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతోంది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న ధర్మన్ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను వేరే దర్శకులతో ప్రారంభించాలని భావించినా, చివరకు అశ్వత్ బాధ్యతలు చేపట్టారు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీ వైద్యుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో సిమ్రాన్, రాశి ఖన్నా, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే రెండో షెడ్యూల్లో కొనసాగుతోంది.
ధర్మన్‌తో పాటు రజనీకాంత్ లైనప్ కూడా ఆసక్తికరంగా ఉంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2లో ఆయన మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు నటిస్తుండగా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తమ అతిథి పాత్రలను కొనసాగించనున్నారు. హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2026 అక్టోబర్ 15న విడుదల కానుంది.
అదే సమయంలో కమల్ హాసన్‌తో కలిసి మరో ప్రాజెక్ట్‌పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం KHxRK రీయూనియన్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 51 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత కూడా వరుస భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రజనీకాంత్, తన స్టార్డమ్కు ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిస్తున్నారు.
- Tags
- cinema
- Rajinikanth
తాజావార్తలు
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?