Gidugu Rudraraju: వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. త్వరలో వైఎస్.రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు అధిష్టానం నుండి సమాచారం ఉందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. అమలాపురంలో గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కూటమి పోటీ చేస్తుందని ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్ చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు రానున్నారని తెలిపారు.
Read Also: Ambati Rambabu: మంత్రి విడదల రజనీ ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి దుర్మార్గం
ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. “త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు నాకు అధిష్టానం నుండి సమాచారం ఉంది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాకు సమాచారం ఇచ్చారు… వైఎస్సార్‌సీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాకు టచ్ లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కూటమి పోటీ చేస్తుంది. త్వరలో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక ,తెలంగాణ ముఖ్యమంత్రులు రానున్నారు.” అని తెలిపారు.