కేంద్రం మన్మోహన్ సింగ్ను భారత రత్నతో గౌరవించాలి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనేనని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి కలుగుతుంది అంటే అది.. పారదర్శకతకి సమాచార హక్కు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్కి దక్కుతుందన్నారు. తెలంగాణ…
కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో.. బైక్ పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.
సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాశీ జగత్ గురు శ్రీ మల్లికార్జున విశ్వరాజ్య శివచార్య మహా స్వామి ఆధ్వర్యంలో 108 మంది వీర శైవ పండితులచే స్వామివారి కళ్యాణం జరుగనుంది.
నాగార్జునసాగర్ డ్యాం భద్రత తెలంగాణ స్పెషల్ పోలీస్ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటివరకు భద్రత విధులు నిర్వహించిన కేంద్ర పారా మిలిటరీ బలగాలు వెనక్కి వెళ్లడంతో... ఎస్పీఎఫ్ డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనేనని తెలిపారు.
విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా విజయవాడ నగరంలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ,…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈడీ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐకి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.
సిద్ధిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్లో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ..…
కేటీఆర్ క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ.. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్…
నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ…