రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. క్లాస్ మెట్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బాలుడు.. సాయంత్రం సూసైడ్ చేసుకున్న వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భీముని మల్లా రెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్ (17) అనే 10వ తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో శివ కిషోర్ పై విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో.. మనస్థాపానికి గురైన శివ కిషోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Also: Maruti Suzuki Sales: 2024లో అత్యధికంగా అమ్ముడైన మారుతీ సుజుకి కారు ఇదే..
శివ కిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. అంతకుముందు.. మృతుడి తల్లికి కూడా వార్నింగ్ ఇచ్చారు అమ్మాయి కుటుంబ సభ్యులు. కాగా.. శివ కిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. శివ కిషోర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పట్టుకునేందుకు జిల్లా బాస్ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Anna University Case: లైంగిక వేధింపుల కేసుని రాజకీయం చేస్తున్నారు.. హైకోర్ట్ ఫైర్..