ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి…
దేశాన్ని ఏకం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దేశ సంపద ఈ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. లౌకికవాదం కలిగిన ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడి బిడ్డనేనని మతం పేరిట విభజన చేయడం తగదన్నారు. మత విభజన పేరిట వైశ్యామ్యాలను సృష్టించి…
గురువారమే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రజల కళ్లన్నీ నిర్మలాసీతారామన్ బడ్జెట్‌పైనే ఉన్నాయి. పైగా త్వరలోనే అతి పెద్ద ఎన్నికల జాతర జరగబోతుంది. కొద్దిరోజుల్లోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం.. పైగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు.…
గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఇజ్రాయెల్ దళాల తాజా వ్యూహాలు బయటపడ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రహస్య కార్యాచరణ ప్రణాళికలో భాగంగా.. దాని దళాలు పౌరులు, వైద్య సిబ్బంది వేషధారణలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని ఆసుపత్రిలోకి చొరబడి ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పై టీడీపీ నాయకుడు కంచేటి సాయిబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కంచేటి సాయికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు వైసీపీ శ్రేణులు. తమ నాయకుడు పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కర్రలు చేత పట్టి టీడీపీ నాయకుడు సాయిబాబు ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు.…
చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు.. అధికారికంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట.. అధికారికంలో వచ్చేది లేదు, చచ్చేది లేదుని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతి పై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు…
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనకు వెళ్లకూడదని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు. పలువురు తమ ప్రయాణాలు క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. దీంతో ఆ దేశ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. భారత్ పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని హితవు పలికాయి. మోడీకి, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్…
ఉత్తరప్రదేశ్‌లోని 16 లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌కు 11 సీట్లు కేటాయించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.