పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారని అన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, నిర్ణయాలను చెప్పారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట లేదని, అన్ని రంగాల్లో మోడి ప్రభుత్వం అద్భుతమయిన అభివృద్ధి సాధించిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ప్రసంగంలో రాజకీయ అంశాలు లేకుండా, అభివృద్ధి పైనే మాట్లాడారని, వివిధ శాఖలు సాధించిన అనేక అంశాలు, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చారన్నారు. దేశప్రజలకు స్పష్టమయిన సందేశం రాష్ట్రపతి ఇచ్చారని, తెలంగాణ లో ఈ రోజుతో గ్రామ పంచాయితీల ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగుస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పంచాయితీ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయితీల నిధులు దారి మళ్లించారని, సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తోంది.. ప్రభుత్వం ఎటువంటి స్పష్టమయిన నిర్ణయం తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా..’స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పంచాయితీ పాలనకు ప్లాన్ చేస్తే, సరైంది కాదు. రాజ్యాంగ విరుద్ధం. గ్రామ సర్పంచి లేక పోతే గ్రామ సభలు ఎలా పెడతారు. సంక్షేమ పథకాల ఎంపికకు ప్రమాదమ్.. లబ్దిదారుల ఎంపిక అగిపోనుంది. కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల కోడ్ కంటే ముందే ఆరు గ్యారంటిలను అమలు చెయ్యాలి. తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టాం. పకడ్బందీ వ్యూహంతో బిజెపి పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్లనుంది. తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తాం. బీజేపీ ఎందరికో పద్మ అవార్డులు ఇచ్చింది.. వాళ్ళను పార్టీల్లో చేరాలని ఎక్కడ కోరలేదు. గౌరవించడం మా బాధ్యత. రాజకీయాలతో అవార్డులను ముడిపెట్టొద్దు.’ అని కిషన్ రెడ్డి అన్నారు.