రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జెడ్పీటీసీ, మాజీ జడ్పీటిసి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారు, కాని మా ప్రభుత్వం స్వేచ్ఛ గా సమస్యలు…
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. నూజివీడు సీటు సారథికి వద్దు, గాడిదను అయినా గెలిపిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది. సారథి వస్తే తరిమి కొడతాం అంటూ పోస్టింగ్ లు వెలిశాయి. ఇప్పటికే టీడీపీ నూజివీడు సీటు తనకు కన్ఫర్మ్ అయిందని.. స్థానిక టీడీపీ నేతలకు సారథి ఫోన్స్ చేయటంతో రచ్చ జరుగుతోంది. తాజాగా పోస్టింగ్ లతో సారథి వ్యవహారం రచ్చగా మారింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన సంగతి తెలిసిందే.
గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే మీదకు వచ్చి.. మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు.. బెంబెలెత్తిపోయారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు.
ఒక చిన్న వివాదం చిలికిచిలి కి గాలి వానగా మారింది. విద్యార్థులు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. తమను బెదిరించారని ఒక జట్టు గట్టిన 13 మంది విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదిన ఘటన ఇది. వీరంతా చదువుతున్నది కేవలం ఆరవ తరగతి మాత్రమే. ఆరవ తరగతిలోనే కక్షలు కార్పన్యాలతో ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వెళ్లిన ఘటన ఇది. ఇది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని tswrjc హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఆరవ తరగతి చదువుతున్న…
గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో…
గతేడాది జూలై నెలలో మహారాష్ట్రలో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా గంజాయి రవాణా కాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీసనర్ జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. గత రాత్రి ఓడిస్సా , ఎపి రాష్ర్టాల మీదుగా గంజాయి చాక్లెట్స్ హైదరాబాద్ కు తరలుతున్న వాటిని ఎక్పైజ్ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా ఖమ్మంలో గంజా చాక్లెట్స్ పట్టుకోవడం ఇదే ప్రదమం.. హైదరాబాద్ లో చాక్లెట్లను ఒక్క చోట అప్పగించవలసిన ఉన్నదని నిందితులు చెప్పారని అంటున్నారు. దీని మీద ఇంకా లోతుగా…
ఫేక్ పోస్టింగులతో టీడీపీ తలపట్టుకుంటుంది. టీడీపీని.. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఫేక్ పోస్టింగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ - జనసేన మధ్య గ్యాప్ పెంచేలా పోస్టింగులు ఉండడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది. జనసేనకు 63 స్థానాలు ఇచ్చామంటూ ఇటీవలే అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ పోస్టింగులు చేశారు. అంతేకాకుండా.. పవన్ ను విమర్శిస్తున్నట్టు బుద్దా వెంకన్న పేరుతో ఫేక్ పోస్టింగులు పెట్టారు. కాగా.. కేశినేని నానినే తనపై ఫేక్ పోస్టింగులు పెట్టారని బుద్దా…
ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.